Header Banner

పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ! 21% శాతం నీటి కొరత..!

  Tue May 06, 2025 13:37        India

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత్ తీసుకుంటోన్న నిర్ణయాలు పాకిస్తాన్ కూసాలను కదిలిస్తోంది. అన్నింటికీ మించి భారత్ నుంచి ఆ దేశానికి సరఫరా అవుతోన్న నదీ జలాల సరఫరాను నిలిపివేయడం వల్ల దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.


పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా 1960లో పాకిస్తాన్‌తో కుదుర్చుకున్న ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తక్షణమే ఇది అమల్లోకి కూడా వచ్చింది. పాకిస్తాన్‌కు నీటి సరఫరా అందజేసే నదులపై నిర్మించిన రిజర్వాయర్ల గేట్లను మూసివేసింది.



ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

దీని ప్రభావం పాకిస్తాన్‌పై తీవ్రంగా పడింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌ను దెబ్బ కొట్టింది. ఖరీఫ్ సీజన్‌లో సరఫరా కావాల్సిన నదీ జలాల్లో 21 శాతం కొరత ఏర్పడినట్లు ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (IRSA) అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. చీనాబ్ నదీ ప్రవాహంలో అకస్మాత్తుగా తగ్గడం వల్ల ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పాకిస్తాన్‌లో 21 శాతం నీటి కొరత తలెత్తిందని అంచనా వేసింది. పాకిస్తాన్‌లో ఖరీఫ్ సీజన్‌ పంటలకు సింధు నదీ జలాలే ప్రాణవాయువుగా చెప్పుకోవచ్చు. సింధు- దాని ఉపనదుల నుంచి పాకిస్తాన్‌లో 80 శాతం పొలాలకు నీరు సరఫరా అవుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్‌పై నిర్మించిన సలాల్, రాంబన్ జిల్లాల్లో నిర్మితమైన బాగ్లిహార్ రిజర్వాయర్ల నుంచి ప్రతి సీజన్‌లోనూ ఈ నీళ్లు విడుదల అవుతుంటాయి.



ఇప్పుడు పహల్గామ్ ఉగ్రవాద దాడిని దృష్టిలో పెట్టుకుని భారత్ ఈ రెండు రిజర్వాయర్ల గేట్లను మూసివేసింది. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. కిషన్‌గంగా డ్యామ్ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలను తీసుకోవాలని భావిస్తోంది. నేడో, రేపో ఈ రిజర్వాయర్ గేట్లను మూసివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


భారత్ తీసుకున్న ఈ చర్యల వల్ల పాకిస్తాన్‌లో ఖరీఫ్ సీజన్‌కు 21 శాతం నీటి కొరత తలెత్తిందని ఐఆర్ఎస్ఏ అడ్వైజరీ కమిటీ ప్రకటించిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మారాలా వద్ద చీనాబ్ నది ప్రవాహం అకస్మాత్తుగా తగ్గడం పట్ల ఈ సలహా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఖరీఫ్ సీజన్ అంటే మే నుండి సెప్టెంబర్ వరకు నదీ జలాల లభ్యత గురించి అంచనా వేయడానికి ఐఆర్ఎస్ఏ సమావేశమైంది. భారత్ నుండి తక్కువ నీటి సరఫరా కారణంగా మారాలా వద్ద చీనాబ్ నది ఇన్‌ఫ్లో అకస్మాత్తుగా తగ్గిందని, దీనివల్ల ప్రారంభ ఖరీఫ్ సీజన్‌లో కొరత ఏర్పడిందని ఏకగ్రీవంగా నిర్ధారించింది.


ఇది కూడా చదవండిటీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #IndiaPakistanTensions #PahalgamAttack #IndusWaterTreaty #WaterCrisisPakistan #ChenabRiver #KharifSeason